భారతీయులకు ఆస్ట్రేలియా వీసా.. అందని ద్రాక్షాలా మారనుందా..?
ఈ కాలంలో భారతదేశంలో ఉన్న యువత విదేశాల్లో చదవడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.దీంతో ఇటీవల కాలంలో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు విదేశాలు వరుస షాక్‌లు ఇస్తున్నాయి. కాగా ఇప్పటికే బ్రిటన్ వీసా రూల్స్‌ను కఠినతరం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియా కూడా అదే బాటలో నడుస్తోంది. దీంతో ఇకపై ఆస్ట్రేలియాలో విదేశి విద్యార్థులు,లో స్కిల్డ్ వర్కర్లకు వీసా రావడం మరింత క్లిష్టతరం కానుంది. ఈ మేరకు విద్యార్థులు ఇకపై ఆస్ట్రేలియా వీసా పొందాలంటే ఇంగ్లీషు టెస్టులో హై రేటింగ్ దక్కించుకోవడం తప్పనిసరిగా మారనుంది. అంతేకాకుండ స్టూడెంట్ వీసా పొడిగింపు అవకాశాలు కూడా తగ్గనున్నట్లు సమాచారం. అయితే ఆస్ట్రేలియాలో వలసలు తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

