ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 480, ఇండియా 36/0
చివరి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 480 పరుగులకు ఆలౌటయ్యింది. రెండో రోజు టీమిండియా వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. శుభ్‌మాన్ గిల్, రోహిత్ శర్మ పది ఓవర్లు ఆడి 36 పరుగులు సాధించారు. ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా కంటే 446 పరుగుల వెనుకబడి ఉంది. గిల్ 18, రోహిత్ 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అంతకుముందు, ఉస్మాన్ ఖవాజా అద్భుతంగా 180 పరుగులతో చెలరేగి ఆడాడు. కామెరాన్ గ్రీన్ తన తొలి సెంచరీని నమోదు చేసి… ఆస్ట్రేలియా స్కోరును పరుగులు పెట్టించాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా గౌరవ ప్రదమైన 480 పరుగులు సాధించింది. రవిచంద్రన్ అశ్విన్ (6/91) రెండో రోజు ఐదు వికెట్లు పడగొట్టి, మ్యాచ్‌పై భారత్ పట్టు పోకుండా కాపాడాడు. ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ ఖవాజాను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. మహ్మద్ షమీ 2 వికెట్లు తీశాడు. ఇండియా-ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సీరిస్‌లో ఒక జట్టు అత్యుత్తమ స్కోర్ ఇదే కావడం విశేషం. నాలుగో టెస్టులో గెలిస్తే టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించినట్టవుతుంది. ఐతే రెండో టెస్టులో గెలిచి.. సీరిస్ సమయం చేయాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా గెలిచేందుకు 29, ఇండియా గెలిచేందుకు 22 శాతం ఛాన్స్ ఉండగా.. డ్రా అయ్యేందుకు 49 శాతం అవకాశం ఉంది.


