జనగామ బీఆర్‌ఎస్ పార్టీలో ఆడియో లీక్ కలకలం
జనగామలోని బీఆర్‌ఎస్ పార్టీలో ఆడియో లీక్ వ్యవహారం కలకలం రేపింది. ఎమ్మెల్యే సంపత్ రెడ్డి, నర్మెట్టకు చెందిన జడ్పీటీసీతో మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి. తన ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెట్టేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆయన మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేఖంగా సీఎం కేసీఆర్‌కు రిఫరెండం ఇద్దామంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ మండలంలో జడ్పీటీసీలు, మండల అధ్యక్షుల గురించి ఈ సంభాషణ ఉంది. జనగామ పల్లా అనే వ్యక్తి పేరును నామినేట్ చేయాలంటూ మాట్లాడిన ఆడియో లీకవడంతో బీఆర్‌ఎస్ పార్టీలో కలకలం రేగింది. ఎన్నికలకు ముందు ఇలాంటి వ్యాఖ్యానాలు, మంత్రాంగాలు మామూలేనంటూ చాలామంది పార్టీ వ్యక్తులు కొట్టి పడేస్తున్నారు.