Home Page SliderTelangana

MMTS ట్రైన్ లో యువతిపై అత్యాచారయత్నం.. నిందితుడు ఇతనే

హైదరాబాద్ MMTS ట్రైన్ లో యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు గౌడవల్లికి చెందిన జంగం మహేశ్‌గా గుర్తించారు. మహేశ్ ఫోటోను బాధితురాలికి పోలీసులు చూపించారు. ఫోటో చూసిన బాధితురాలు మహేశ్ ను గుర్తించింది. గంజాయికి బానిసైన నిందితుడు పాత నేరస్తుడని పోలీసుల విచారణలో తేలింది. ఏడాది క్రితమే మహేశ్ భార్య అతన్ని వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలించారు. బాధిత యువతిని ఆస్పత్రిలో తెలంగాణ జీఆర్పీ ఎస్పీ చందన దీప్తి పరామర్శించారు. ప్రస్తుతం యువతి ప్రాణాపాయం నుండి బయటపడిందని వెల్లడించారు.