కేంద్రమంత్రిపై దాడికి యత్నం..
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కు భారీ ముప్పు తప్పింది. ఛాఠమ్ హౌస్ లోని థింక్ ట్యాంక్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కారులో ఆయన బయలుదేరుతుండగా.. అక్కడే ఉన్న ఖలిస్థానీ సానుభూతిపరులు జైశంకర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలకలం సృష్టించారు. ఓ దుండగుడు భద్రతా సిబ్బందిని దాటుకుని ఆయన కారు వద్దకు దూసుకొచ్చి జైశంకర్ పై దాడికి యత్నించాడు. భారత జాతీయ జెండాను అవమానపరిచేలా ప్రవర్తించాడు. పోలీసులు అప్రమత్తమై దుండగుడిని అరెస్ట్ చేశారు. ఖలిస్థానీ సానుభూతిపరులను అక్కడి నుంచి చెదరగొట్టారు పోలీసులు. అయితే.. జై శంకర్ పై దుండగుడు దాడికి ప్రయత్నించినప్పుడు భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారంటూ కేంద్రం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

