బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై హత్యాయత్నం..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగింది, ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి సమయంలో సైఫ్ ఇంట్లో శబ్దం రావడంతో కొంతమంది వర్కర్ మేల్కొన్నారు. సైఫ్ వెంటనే బయటకు వచ్చి దొంగను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కానీ, ఆ సమయంలో దొంగ కత్తితో దాడి చేసి సైఫ్ ను తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడి తర్వాత సైఫ్ కి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దాడి కేసును పరిశీలించడానికి ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ గాలిస్తున్నారు. ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, దొంగను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ ఖాన్ మరియు వారి పిల్లలు క్షేమంగా ఉన్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా, ఈ దాడి సమయంలో దొంగను అడ్డుకున్నందుకు సైఫ్ పై దాడి జరగడంతో, ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.