అట్టహాసంగా హమారా సంవిధాన్
పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్ పేరుతో వేడుకలు జరిపారు.లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా స్వాగతోపన్యాసం చేయగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇరువురూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రెసిడెంట్ ఖర్గే పాల్గొని మాట్లాడారు. 75వ రాజ్యాంగ వేడుకల జ్ఞాపకార్థం నాణెం, పోస్టల్ స్టాంప్ లను విడుదల చేశారు.