పబ్ లపై దాడులు
బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ పరిధిలోని పలు పబ్ లపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్సె పోలీసుల ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పలువురు యువతులతో నిర్వాహకులు డాన్స్ లు చేయిస్తున్నట్లు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు దాడులు చేసి, పబ్ ఓనర్లతో సహా మొత్తం 140 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పబ్ లకు వచ్చే కస్టమర్లను ఆకర్షించే విధంగా వారితో పాటు మద్యం సేవిస్తూ.. డాన్స్ లు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.