పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడమేంట్రా?
రాజకీయాలు హుందాగా చేయాలే తప్ప…ధ్వంసపూరితంగా ఉండకూడదని తెలంగాణ పీసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు.నాంపల్లి బీజెపి కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నేతలు,యూత్ కాంగ్రెస్ నేతలు దాడులనుద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.బీజెపి వాళ్లు చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి క్షమించరానివని అంత మాత్రాన భౌతిక దాడులకు పాల్పడటం వల్ల పార్టీకి నష్టమే తప్ప దాని వల్ల ఒనగూరే ప్రయోజనం శూన్యమన్నారు.ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్‌లో పునరావృతమైతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.