ఎమ్మెల్యేపై కోడిగుడ్లతో ఎటాక్
తెలంగాణలోని హనుమకొండలో కమలాపురం గ్రామసభలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై అధికారులను ప్రశ్నించారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఏమీ చేయలేదని విమర్శలు మొదలుపెట్టారు. దీనితో అక్కడే ఉన్న కాంగ్రెస్ శ్రేణులు, బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ కార్యకర్తలు టమాటాలు, కోడిగుడ్లతో కౌశిక్ రెడ్డిపై విసిరారు. ఒక ప్రభుత్వాధికారికి కూడా అవి తగిలాయి. బీఆర్‌ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ నాయకులపై కుర్చీలు విసురుతూ ఎటాక్ చేశారు. దీనితో అక్కడ వాగ్వాదాలు, రసాభాస ఏర్పడింది.

