Home Page SliderTelangana

కౌశిక్ రెడ్డిపై టమాటాలతో దాడి

గ్రామ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టామాటాలతో కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ లో గ్రామసభలో పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య మాటల యుద్దం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు. పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఎటువంటి డెవలప్ మెంట్ జరగలేదని కౌశిక్ రెడ్డి అన్నారు. దీంతో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు టమాటాలు, కోడి గుడ్లు విసిరారు. అలర్ట్ అయిన ఎమ్మెల్యే గన్ మెన్లు ఆయనను వేదిక మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలు, నాయకులను చెదరగొట్టారు.