హిందూ దేవాలయాలపై దాడి.. విగ్రహాలు ధ్వంసం
బంగ్లాదేశ్ అంతర్యుద్ధంతో సతమతమవుతోంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా హిందూ దేవాలయాలపై దాడులు తీవ్రం చేస్తున్నారు. తాజాగా మైమెన్ సింగ్, దినాజ్ పూర్ అనే ప్రాంతాలలో 3 హిందూ ఆలయాలలోని 8 విగ్రహాలను ధ్వంసం చేశారు. గత రెండు రోజుల్లో మైమెన్ సింగ్‌లోని రెండు ఆలయాలలో 3 మూలవిరాట్టులను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలపై ఎలాంటి కేసులు నమోదు చేయలేదన్నారు. పొలాష్ ఖండ్ అనే ప్రాంతంలో కాళీ మందిరంపై దాడి ఘటనలో మాత్రం అలాలుద్దీన్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. హిందువులపై దాడుల సంఘటనలలో ప్రభుత్వ తీరును వ్యతిరేఖిస్తూ పలు దేశాలలోని హిందూ సంఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువుల హక్కులను కాపాడవలసిన ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని మండిపడుతున్నారు.

