Andhra PradeshNews

చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి

టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నందిగామ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్షనేత నందిగామ జిల్లాలో `బాదుడే బాదుడు’ నిరసన రోడ్‌షో నిర్వహిస్తున్న చంద్రబాబు కాన్వాయ్‌పై ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది. నందిగామలో చంద్రబాబు పర్యటనకు భారీ ఎత్తున జనం వచ్చారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో కరెంట్‌ నిలిచిపోయింది. ఆ తర్వాత చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు వచ్చి పడ్డాయి. దీంతో చంద్రబాబు సెక్కూరిటీ ఆఫీసర్‌ మధుబాబుకి గాయాలయ్యాయి. ఇదంతా ఫ్రీ ప్లాన్డ్‌గా జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాళ్ల దాడి జరిగిన తర్వాత ఆయన చుట్టూ సెక్యూరిటీ సిబ్బంది వలయంగా మోహరించారు. రోడ్‌షో త్వరగా ముగించాలని పోలీసులు ఒత్తిడి చేశారు. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ మొత్తం పులివెందుల రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీలకు భయపడనన్నారు. పోలీసులు కూడా భద్రత గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను సాగనంపడం ఖాయమని చంద్రబాబు వ్యాఖ్యనించారు.