Home Page SliderTelangana

అమీర్‌పేట్‌లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్న సంస్థపై ATS దాడులు

హైదరాబాద్‌లో కోచింగ్ అంటే విద్యార్థులందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు అమీర్‌పేట్.దీంతో ఈ ప్రాంతంలో  కొన్ని వందల కొద్దీ కోచింగ్ సెంటర్లు కుప్పులు తెప్పలుగా వెలిశాయి. నిత్యం విద్యార్థులతో రద్దీగా ఉండే ఈ ప్రాంతాన్ని ఓ సాఫ్ట్‌వేర్ ట్రైనర్ దేశంలో  ఉగ్రవాదాన్ని పురికొల్పేందుకు వాడుకుంటున్నాడు. దీంతో గుజరాత్ ATS పోలీసులు ఇవాళ హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. జావెద్ అనే సాఫ్ట్‌వేర్ ట్రైనర్ అమీర్‌పేట్‌లో కోచింగ్ సెంటర్ ముసుగులో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు ATS (ANTI TERRORIST SQUD) గుర్తించింది. జావెద్‌తోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్న ATS పోలీసులు ప్రస్తుతం  వారిని విచారిస్తున్నారు. అంతేకాకుండా ఆ కోచింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిని సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో ISKPలో చేరాలనుకున్న సానుభూతి పరులను ATS పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు వారిచ్చిన సమాచారంతో గత రెండు రోజులుగా హైదరాబాద్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు.