ఆలయంలో దారుణం
సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి గుడిలో విగ్రహం ధ్వంసం చేశారు దుండగులు. ఈ ఘటనపై మండిపడ్డారు కేంద్రమంత్ర కిషన్ రెడ్డి. కొంతమంది మతోన్మాదులు అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ప్రభుత్వంతో మాట్లాడి ప్రతీ దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. భక్తులు రోడ్డుపై భైఠాయించి, నినాదాలు చేశారు. హిందూ సంఘాలు ఉద్రిక్తతలు చేశారు. స్థానికులు అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నేతలు తలసాని యాదవ్, మాధవీలత, కిషన్ రెడ్డి తదితరులు ఈ ఘటనను ఖండించారు. ఉద్రిక్తతలు ఎక్కువవడంతో బీజేపీ నేత మాధవీలతను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

