Home Page SliderNational

తమిళనాడు మధురైలో దారుణం

తమిళనాడులోని మధురైలో దారుణం జరిగింది.ఎన్టీకే పార్టీ ముఖ్యనేత సుబ్రమణ్యన్ దారుణ హత్యకు గురైయ్యారు. కాగా గుర్తుతెలియని వ్యక్తులు సుబ్రమణ్యన్‌ను కత్తులతో నరికి దారుణంగా చంపేశారు.తమిళమాడు మంత్రి త్యాగరాజన్ ఇంటి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే సుబ్రమణ్యన్ హత్యకు ప్రధాన కారణం పాత కక్ష్యలే అని పోలీసులు వెల్లడించారు.కాగా దీనిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.