విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు..
ఏప్రిల్ 26వ తేదీన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘500 ఏళ్ల కింద ట్రైబల్స్ కొట్టుకున్నట్టు.. పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి’ అంటూ టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ వ్యాఖ్యలు చేశారు. విజయ్ చేసిన వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచాయి. అయితే.. గిరిజన జాతిని అవమాన పరుస్తూ మాట్లాడాడని హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ఎస్ ఆర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

