ఎమ్మెల్సీ కవిత మామపై అట్రాసిటీ కేసు
నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత మామ రాం కిషన్ రావు భూకబ్జాకు పాల్పడ్డారని దళితులు ఆందోళనకు దిగారు. బైపాస్ రోడ్డు వద్ద గల అర్ కేఆర్ అపార్ట్ మెంట్ ముందు ఉన్న తమ స్థలాన్ని కబ్జాకు చేశాడని దళితులు ఆరోపించారు. రాంకిషన్ రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేయాలని స్థానిక పొలిస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలంలో ఎమ్మెల్సి కవిత ప్రధాన అనుచరుడు బీఆర్ఎస్ నేత సూదం రవీందర్..బాధితులను దుర్భాషలాడారని ఆరోపిస్తున్నారు.

