Andhra PradeshHome Page Slider

ఏలూరులో బాలికలపై దారుణం..

ఏపీలోని ఏలూరులో బాలికలపై దారుణ సంఘటన చోటుచేసుకుంది. అక్కడ స్థానిక దయానంద సరస్వతి సేవాశ్రమంలో బాలికలపై హాస్టల్ వార్డెన్ భర్త శశికుమార్ కీచకుడిలా ప్రవర్తిస్తున్నాడని బాలికలు ఫిర్యాదు చేశారు. వారిని ఫోటో షూట్‌ల పేరు చెప్పి బయటకు తీసుకెళ్లేవాడని, కాళ్లూ,చేతులూ కట్టేసి, అఘాయిత్యానికి పాల్పడేవాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అతడు ఈ హాస్టల్‌లో వార్డెన్‌గా తన రెండవ భార్యను, సంరక్షురాలిగా మేనకోడలిని పెట్టి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు. ఈ నెల 15న ఒక బాలికను కారులో బాపట్ల తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడని ముగ్గురు బాలికలు ఫిర్యాదు చేశారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. వసతిగృహంలో బాలికలను ప్రశ్నిస్తున్నామని, ఎంతమంది వేధింపులకు గురయ్యారో తెలుసుకుంటున్నామని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఎదురు తిరిగినవారిని తీవ్రంగా కొట్టేవాడని పేర్కొన్నారు. జుట్టు పట్టి లాగి మోకాళ్లపై కూర్చోపెట్టేవాడని మండిపడ్డారు. అతడి వేధింపులకు తట్టుకోలేక టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది సోషల్ మీడియాలో రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి రాక్షసులను బహిరంగంగా ఉరి తీయాలని, తీవ్రంగా శిక్షించాలని కోరుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాలికలకు న్యాయం చేయాలని కోరుతున్నారు.