Andhra PradeshHome Page Slider

బిస్కెట్ల ఆశపెట్టి చిన్నారిపై అఘాయిత్యం

ఆంధ్రప్రదేశ్‌లో కామాంధులు రెచ్చిపోతున్నారు. వరుసగా చిన్నారులపై దారుణాలకు తెగబడుతున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలోని దొరవారిసత్రం మండలంలో గంజాయి మత్తులో ఓ యువకుడు ఎనిమిదేళ్ల బాలికను బిస్కట్లు ఇస్తానంటూ ఆశపెట్టి ఆమెపై అఘాయిత్యం చేసి, హత్య చేశాడు. అక్కడ రైసుమిల్లులో పనిచేస్తూ ఉపాధి పొందుతున్న బీహర్‌కు చెందిన దంపతుల కుమార్తెను అదే మిల్లులో పని చేస్తున్న బిహార్‌కే చెందిన దిలీప్ బిస్కట్లు ఇప్పిస్తానంటూ చెప్పి ఉదయం తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు మిల్లు నుంచి వచ్చి చిన్నారి కనిపించకపోయేసరికి చుట్టుపక్కల వెతికారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మిల్లు సమీపంలోని అడవిలో మేకల కాపర్లు బాలిక మృతదేహాన్ని చూసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలిక శరీర భాగాలలో గాయాలు ఉండడంతో అత్యాచారానికి గురై, హత్య కావించబడిందని తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలోని ఆరోగ్యకేంద్రానికి తరలించారు. సీసీ కెమెరాలో దిలీప్ బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలు చూసి, అతడిని విచారించగా, బిస్కెట్లు కొనిచ్చానని, తర్వాతేమైందో తెలియదని చెప్పినట్లు సమాచారం. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని తిరుపతి ఎస్పీ తెలిపారు.