హోం వర్క్ చేయకపోతే టీచర్ ఏం చేసిందంటే..?
ఒంగోలులోని గంటపాలెంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. హోం వర్క్ చేయలేదని వాతలు పెట్టింది ఓ ట్యూషన్ టీచర్. విద్యార్థి హోం వర్క్ చేయకపోవడంతో అట్లకాడ కాల్చి పిరుదులపై వాతలు పెట్టింది టీచర్ సాబిదా. నొప్పి భరించలేక ఆ విద్యార్థి తల్లిడిల్లిపోయాడు. అయినా కాని టీచర్ అంతటితో ఆగకుండా అలాగే కింద కూర్చోపెట్టి హోం వర్క్ చేయమని చెప్పింది. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు ఆ టీచర్ ను నిలదీశారు. హోం వర్క్ చేయకపోతే అలాగే శిక్ష ఇస్తానని రాష్ గా సమాధానం చెప్పింది టీచర్. నాపై కేసు పెట్టాలనుకుంటే పెట్టుకుండి అని ఎదురుగా వార్నింగ్ ఇచ్చింది.