అతివల చేతులకు నెలంతా గోరింటాకు సందడి
హైదరాబాద్: ఆషాఢ మాసంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. వాతావరణ చల్లబడుతుంది. సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే వాతావరణం చల్లబడినా శరీరంలో వేడి మాత్రం అలాగే ఉంటుంది. గోరింటాకులో వేడిని తగ్గించే గుణం ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెంచి రక్త ప్రసరణ జరిగేలా చేస్తుంది. అందుకే ఈ మాసంలో మహిళలు, యువతులు సామూహికంగా ఆలయాల్లో, ఇంట్లో గోరింటాకు పెట్టుకుని సందడి చేస్తుంటారు.