Breaking NewsHome Page SliderTelangana

రాత్రైతే చాలు….రాళ్ల వ‌ర్షం కురుస్తుంది

చేప‌ల వ‌ర్షం చూశాం….వ‌డ‌గ‌ళ్ల వ‌ర్షం చూశాం.కానీ రాళ్ల వ‌ర్షం గురించి వినిగానీ,చూసి ఉండ‌రు.కానీ తెలంగాణాలో ఫ‌స్ట్ టైమ్ ఈ అనుభూతిని చ‌విచూస్తున్నారు ప్ర‌జ‌లు. రాత్రయితే ఇళ్ల‌పై రాళ్ల వర్షం కురుస్తుంది.దీంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో గత కొన్ని రోజులుగా రాత్రి 7 గంటల నుండి 12 గంటల వరకు నలు దిక్కుల నుండి ఇళ్లపై రాళ్ల వర్షం కురుస్తుంది.ఇళ్ల‌పై ఇలా రాళ్లు, మట్టి పెళ్లలు పడటంతో కాలనీ వాసులు వణికిపోతున్నారు. రాళ్ల భయంతో కంటి మీద కునుకు లేకపోవడంతో రాత్రంతా మేల్కొనే ఉంటున్నారు.రాళ్లతో పాటు కాలనీకి చెందిన రాపోలు దర్గయ్య అనే వ్యక్తి ఇంటి ముందు పసుపు, కుంకుమ, ముగ్గులతో కొబ్బరి కాయలు కొట్టి దీపం వెలిగించి ఉంటుంది.ఇది చూసిన స్థానికులు భ‌యంతో ప్రాణాల‌ర‌చేత ప‌ట్టుకుని ఊరు విడిచి వెళ్లిపోతున్నారు.ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల విచార‌ణ చేప‌ట్టారు.