గుండెపోటు ఘటనలు పెరుగుతున్న వేళ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇటీవల కాలంలో దేశంలో గుండెపోటు ఘటనలు విపరీతంగా పెరిగాయి. వయస్సుతో సంబంధం లేకుండా వస్తున్న ఈ గుండెపోటులు ప్రజలందరిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం వీటిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది. కాగా ఈ మేరకు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గుండెపోటు వచ్చినవారికి గంటలోనే ప్రథమ చికిత్స అందించేలా చర్యలు చేపట్టనుంది. దీనిలో భాగంగా చెన్నైకి చెందిన స్టెమీ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకోనుంది. వీటిని మొదటిగా కర్నూలు,కాకినాడ జీజీహెచ్‌లలో క్యాథ్‌ల్యాబ్స్ పేరుతో ఏర్పాటు చేయనున్నారు. వీటిలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ECG,ఇతర టెస్టులు చేస్తారు. ఆ రిపోర్టులను నిపుణులకు పంపి ,వారి సలహాలతో చికిత్స అందించనున్నారు.

