మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించనున్న అసెంబ్లీ
తెలంగాణ అసెంబ్లీ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు నివాళి అర్పించనుంది. ఈ మేరకు సోమవారం (30-12-2024) రోజున ప్రత్యేకంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభకానుంది. సంతాప దినాల్లో భాగంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించనుంది శాసనసభ. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు ఎమ్మెల్యేలకు సమాచారం పంపించారు.


