ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రణాళిక తయారు చేశారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అదే రోజు ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెలాఖరుతో ముగుస్తుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. బడ్జెట్ తో పాటు ప్రభుత్వం ఇతర బిల్లులను సభ ముందు ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు ముమ్మరం చేశారు.