Home Page SliderTelangana

షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు:కేసీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్, ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఐతే, ఆ వార్తలను నమ్మొద్దని పార్టీ నేతలకు కేసీఆర్ స్పష్టం చేశారు. సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తున్నాయని… నేతలంతా ప్రజల్లోనే ఉండాలని గులాబీ బాస్ స్పష్టం చేశారు. ఎన్నికల ఏడాదిలో ప్రజల ఆలోచనల మేరకు పనిచేయాలని నేతలకు హితవు పలికారు.