Home Page SliderTelangana

కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం.. నేడు దుబ్బాక బంద్

సిద్దిపేట: దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై అందుకు నిరసనగా సిద్దిపేట జిల్లాలో బీఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు ఆందోళనలకు దిగారు. హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిపై, అందుకు బాధ్యులైన రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ ‌చేస్తూ జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దుబ్బాక, దౌల్తాబాద్, రాయపోల్, మిరుదొడ్డి, తొగుట, చేగుంట, నార్సింగ్, అక్బర్‌పేట- భూంపల్లి మండలాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో ర్యాలీలు, ధర్నాలకు దిగారు.