ఆసీస్‌కు చెమటలు పట్టించిన జింబాబ్వే
పసి కూన అనుకున్న జింబాబ్వే .. ఆస్ట్రేలియాను చితక్కొట్టింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో తన ప్రతాపం ఏంటో చూపించింది. మూడు వన్డేల సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లలోనూ జింబాబ్వేను చెడుగుడు ఆడుకున్న ఆసీస్ ఆటగాళ్ళు.. చివరి వన్డేలో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేద్దామని భావించారు. కానీ.. అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి. అలవోకగా గెలుస్తాం అనుకున్న ఆసీస్.. జింబాబ్వే ముందు తడబడి ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ జట్టును కేవలం 31 ఓవర్లలో 141 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. ఆ తర్వాత 39 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి జింబాబ్వే 142 పురుగులు చేసి .. విజయం సాధించింది. ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ అత్యధికంగా 94 పరుగులు చేయగా.. జింబాబ్వే జట్టులో కెప్టెన్ రెగిస్ చకబ్వా 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.

