భారత్‌లో జరగనున్న ఆసియా కప్ 2025
2025లో పురుషుల ఆసియా కప్ క్రికెట్ టీ 20 ఫార్మాట్ భారత్‌లోనే జరగనున్నదని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ విషయం స్పాన్స్‌ర్ షిప్ రైట్స్ కోసం రిలీజ్ చేసిన ఇన్విటేషన్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అలాగే 2027 ఎడిషన్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌లో నిర్వహించబడుతుందని పేర్కొంది. మహిళల ఆసియా కప్ 2026 టీ 20 ఫార్మాట్ వేదికపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఈ టోర్నీలలో ఆరు దేశాలు పాల్గొంటాయి.