దొంగ చేతిలో ఏఎస్‌ఐ దారుణహత్య
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ ఏఎస్‌ఐ దొంగను పట్టుకుంటున్న నేపథ్యంలో దొంగ ఎదురుదాడి చేయడంతో ఏఎస్ఐ మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దొంగలు పోలీసులను సహితం లెక్కచేయకుండా దాడికి పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా ఆ దొంగ ఓ మహిళ నుంచి డబ్బు , ఫోన్ అపహరించాడు. ఈ నేపథ్యంలో ఆ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఏఎస్ఐను దొంగ కత్తితో పొడిచాడు. దొంగ ఏకంగా 12 సార్లు కత్తితో ఏఎస్ఐని కిరాతకంగా పొడిచాడు. దీంతో ఆ ఏఎస్ఐ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఢిల్లీలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ కుటుంబానికి ఢిల్లీ సీఎం రూ.కోటి రూపాయలు సాయంగా ప్రకటించారు.

