కాంగ్రెస్ సర్కార్ పై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
హైడ్రా కూల్చివేతలపై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పట్టణంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సచివాలయంతోపాటు దేశంలోని ప్రముఖుల సమాధులన్నీ ఎఫ్టీఎల్ లో ఉన్నాయని, చివరికి బాపూఘాట్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని, అలాంటప్పుడు పేదల ఇళ్లు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. 2013లో కాంగ్రెస్ తెచ్చిన భూచట్టం ప్రకారం కూల్చివేతలపై సర్కార్ ముందుకెళ్లాలని సూచించారు. కూల్చివేతలపై కాకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని ఓవైసీ హితవు పలికారు.