Home Page SliderTrending Today

క్రికెట్ దిగ్గజానికి సంగీతం సలామ్ కొట్టిన వేళ

ఐపీఎల్ 2023 వేడుకలు నిన్న ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. కాగా ఈ ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో ఓ అద్భుత దృశ్యం చోటు చేసుకుంది. ప్రముఖ స్టార్ సింగర్ అర్జిత్ సింగ్ CSK కెప్టెన్ ధోని పాదాలకు నమస్కరించారు. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇండియాలోనే టాప్ సింగర్ అయిన అర్జిత్ సింగ్..మహి పాదాలను తాకడంతో ధోని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదే ధోని మేనియా అని.. ఎంత పెద్ద సెలబ్రిటీ అయిన ధోనికి ఫ్యాన్ అవ్వాల్సిందేనని సోషల్ మీడియాలో ఆ ఫోటో షేర్ చేస్తున్నారు.