Home Page SliderTelangana

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్-బోధన్‌: కాంగ్రెస్ సభలో రాహుల్

బోధన్: తెలంగాణలో ల్యాండ్, శాండ్, వైన్స్ మాఫియా పెరిగిందని.. ఆ డబ్బంతా సీఎం కేసీఆర్ ఇంటికి చేరిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.

కుటుంబ, అవినీతి పాలన వల్ల తెలంగాణ నష్టపోయింది. రాష్ట్రంలో ప్రజాపాలన కనిపించడంలేదు. దొరల పాలనను అంతంచేసి ప్రజల పాలన తీసుకురావాలి. బీఆర్ఎస్, బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1,200 కి చేరింది. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను ఆ వర్గానికి ఖర్చు చేయడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని రాహుల్ చెప్పారు.