NewsTelangana

మునుగోడులో పోటీకి కళాకారులు

మునుగోడు ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు కళాకారులు సైతం ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణా రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న ఈ మునుగోడు ఉపఎన్నికల్లో కళాకారులు కూడా సత్తా చాటుతామంటున్నారు. తెలంగాణాలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైన అంశం ఏంటంటే మునుగోడు ఉపఎన్నిక. దీని కోసం తెలంగాణాలోని అన్నీ పార్టీలు ఎన్నో వ్యూహాలు,ప్రతి వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. దీంతో తెలంగాణా ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కళాకారులు కూడా ఈ ఉపఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఈ మేరకు చుండూరులో నామినేషన్ వేసేందుకు 70 మంది కళాకారులు సిద్ధమైయ్యారు. ఈ నేపథ్యంలో మునుగోడు ఉపఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకొంది. దీంతో ఈ ఉపఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.