అర్షదీప్ క్యాచ్ వదిలేశాడు.. రోహిత్ శర్మ కేకలు పెట్టాడు
ఆదివారం పాకిస్తాన్ తో జరిగిన ఆసియా కప్ కీలక మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడంపై పలు ఆసక్తికర చర్చలు సాగుతున్నాయ్. 18 ఓవర్లతో అసిఫ్ అలీ క్యాచ్ ను అర్షదీప్ జారవిడవడం వల్లే మ్యాచ్ ఓడిపోయామన్న ఫీలింగ్ కలిగింది. అర్షదీప్ క్యాచ్ వదిలేయడంతో రోహిత్ శర్మ పెట్టిన కేకలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సూపర్ 4 ఆసియా కప్ పోరు ఉత్కంఠభరితంగా సాగింది. విరాట్ కోహ్లి 44 బంతుల్లో 60 పరుగుల భారీ నాక్ నుండి పాకిస్తాన్ వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ 71 పరుగుల నాక్ మ్యాచ్ హైలెట్స్ గా చెప్పాల్సి ఉంటుంది. దుబాయ్ గడ్డపై పాక్ విజయంలో రిజ్వాన్ ఇన్నింగ్స్ పాకిస్తాన్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో సహాయపడింది.
భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 18వ ఓవర్‌లో అసిఫ్ అలీ సులభమైన క్యాచ్‌ను వదిలివేయడంతో మ్యాచ్ ఫలితం డిసైడయ్యింది. రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్‌లో క్రీజులో ఉన్న ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీలతో పాక్ 34 పరుగులు చేయాల్సి ఉంది. మూడో డెలివరీలో, ఆసిఫ్ స్వీప్ షాట్ ఆడగా… బంతి గాలిలోకి వెళ్లింది. క్యాచ్ అర్ష్‌దీప్‌కు సులువుగా అనిపించింది. కానీ క్యాచ్ జారవిడవడంతో మొత్తం మ్యాచ్ తలకిందులయ్యింది. ఇదే సమయంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఉలిక్కిపడ్డాడు. రోహిత్ కోపంగా స్పందించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐతే అర్షదీప్‌కు మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతు ఇచ్చాడు, ఎవరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్‌లను వదులుకోరని యువ ఆటగాడ్ని విమర్శించకూడదని పేర్కొన్నాడు. టీమ్ ఇండియా క్రికెటర్లను చూసి గర్విస్తున్నామన్న భజ్జీ… పాకిస్థాన్ మెరుగ్గా ఆడిందని.. చౌకబారు విమర్శలు మానుకోవాలని అర్ష్ ఈజ్ గోల్డ్” అని ట్వీట్ చేశాడు.

