అడిగితే అరెస్టులు..ప్రశ్నిస్తే కేసులు..
ఇది ఇందిరమ్మ రాజ్యమా? పోలీస్ రాజ్యమా? అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు. బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అడిగితే అరెస్టులు, ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే బెదిరింపులతో ప్రభుత్వం పోలీస్ రాజ్యంలా ప్రవర్తిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఉదయాన్నే ఇంటికి వచ్చి అక్రమ అరెస్టు చేయడం వంటి చర్యలతో హోం మంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మీ పిట్ట బెదిరింపులకు, అక్రమ కేసులకు భయపడే వాళ్లం కాదని పేర్కొన్నారు.