ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్..తీవ్ర ఆందోళన
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని బంజారా హిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నేటి ఉదయం నుండి పోలీసులు భారీగా ఆయన ఇంటి వద్ద మోహరించారు. బుధవారం ఆయన బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ తీసుకోవాలంటూ తీవ్ర ఆందోళన చేశారు. దీనితో ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు నేడు ఆయన ఇంటివద్ద ఆయనను అరెస్టు చేశారు. అక్కడ తమ విధి నిర్వహణలో అడ్డగించారని ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర చేసిన ఫిర్యాదు ఆధారంగా కౌశిక్ రెడ్డితో పాటు 20 మంది అనుచరులపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పుడు ఆయనను అరెస్టు చేశారు. దీనితో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనితో హరీష్ రావును కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

