హైదరాబాద్ జూబ్లీహిల్స్లో పేకాటరాయుళ్ల అరెస్ట్
ఎక్కడో మారుమూల ప్రాంతాలలోనే కొందరు పేకాట ఆడి,పట్టుబడటం మనం చూసి ఉంటాం. అయితే ఇటువంటివి ఇప్పుడు హైదరాబాద్ వంటి మహానగరాలలో కూడా చూడాల్సి వస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్లో బాగా కమర్షియల్ అయిన జూబ్లీహిల్స్లో ఈ పేకాటలు జోరుగా సాగుతున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు పెద్దమ్మ తల్లి గుడి వెనుక ప్రాంతంలో ఉన్న ఒక ఇంటిపై రైడ్ చేశారు. ఈ రైడ్లో మొత్తం 13 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో బొల్లినేని బలరామయ్య, బొల్లినేని శీనయ్యతో పాటు మరికొందరు ఉన్నారని సమాచారం. అయితే బొల్లినేని బలరామయ్య గతకొంత కాలంగా ఈ పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.