రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి
రైతన్నకు అండగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని అందులో భాగంగానే పైరు నాటిన నుంచి పంట కోతలతో పాటు ధాన్యాన్ని గిట్టుబాటు ధరలకు అమ్మే వరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దన్నుగా నిలుస్తోందని పార్టీ ఎంపీ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డి, పార్టీ రీజినల్ కోర్డినేటర్ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మేకతోటి సుచరిత, ముస్తఫా వివరించారు. ఈ సమావేశంలో తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్, డిప్యూటీ మేయర్లు వనమా బాల వజ్రబాబు, సజీలాతోపాటుగా నూరి ఫాతిమా పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయాన్ని పండగలా మార్చిన సీఎం జగన్ వ్యవసాయ నూతన పద్ధతులు, నిర్వహణలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని నేతలు పేర్కొన్నారు.

ఇథియోఫియాతో పాటు పలు దేశాల ప్రతినిధులు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సచివాలయ, రైతు భరోసా కేంద్రాలను కొనియాడినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవస్థల ద్వారా రైతన్నకు సంపూర్ణ ప్రయోజనం అందించి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. గుంటూరు నగరంలోని పార్టీ రిజినల్ కోఆర్ఢినేటర్ కార్యాలయంలో సోమవారం నాడు విలేకరుల సమావేశంలో పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడారు. రైతులకు మంచి జరగాలనే సదుద్దేశంతో ఉన్న ప్రభుత్వం వైయస్సార్ ప్రభుత్వం. విత్తనం వేసిన దగ్గర నుండి పంట అమ్మే వరకు ప్రతి విషయం లో రైతుకు అండగా ఉండే వ్యవస్థ ను తీసుకు వచ్చాం. ఏపీలో జరిగే వ్యవసాయ పద్దతులపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భారత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఒక మోడల్ గా తీసుకునే విధంగా ప్రయత్నం జరుగుతోంది.రేపు జరగబోయే రైతు భరోసా సభకు రైతులు అందరూ రావాలి, అని రాజ్యసభ ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం చేశారని, వ్యవసాయం పండుగలా జరగాలనే ఆశను సీఎం జగన్ ఆశను అమలు చేశారన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు రైతులను మోసం చేయడానికి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసి 5 ఎకరాల కంటే తక్కువ భూమి కలిగిన రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చారని వివరించారు. ఈ పథకంలో టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ.10 వేలు ఇవ్వకపోగా కేవలం లబ్ధిదారులకు రూ. 4 వేలు మాత్రమే ఇచ్చి మోసం చేశారన్నారు.

ఆర్బీకేల ద్వారా రైతులకు వ్యవసాయ పనిముట్లు గతంలో తుఫాన్ కు పంట దెబ్బ తిన్న రైతులకు కూడా రైతు భరోసా పంపిణీ చేస్తున్నట్లు రీజినల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాం. పొగాకు, శనగలు, పసుపు, మిర్చి రైతుల పంటను మద్దతు ధరకు కొనుగోలు చేసాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సబ్సిడీ ద్వారా పనిముట్లు అందించాం. అని వివరించారు. గతంలో కోటయ్య కమిటీ ద్వారా రైతులకు పరిహారం అందకుండా ఎగ్గొట్టారిన విమర్శినంచారు. రైతులను మంచిన ప్రభుత్వం చంద్రబాబుదైతే తమది రైతులకు మంచి చేసే ప్రభుత్వమన్నారు.
నాణ్యమైన విత్తనాలు, ఎరువులతో రైతులకు లబ్ధి
పాదయాత్ర లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ పంట పెట్టుబడి సాయంగా రైతులకు రూ. 1,3500 పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు పంపిణీ చేస్తుండటం రైతులకు ఎంతగానే లబ్ధి చేకూరుస్తోందన్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం నాలుగో విడదల నిధులును సీఎం జగన్ తెనాలి వేదికగా విడుదల చేయనున్నట్లు వివరించారు. నాలుగేళ్లలో రైతు భరోసా పథకం రూ.25,807 కోట్ల సాయం 58,32,788 మంది పేద రైతులకు అందిందని వివరించారు. ఏపీ లో వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, వ్యవసాయ రంగంలో మౌలిక వసతులు కల్పించడంలో సీఎం జగన్ ముందున్నారని కొనియాడారు. ఈ క్రాపింగ్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకు పంట నష్టపరిహారం అందుతుందని భరోసా ఇచ్చారు.
గుంటూరు జిల్లాలో రైతులకు రూ. 868 కోట్లు
గుంటూరు జిల్లాలో రైతులకు రూ.868 కోట్లను 1,73,718 మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద సాయం లభించిందని ఎమ్మెల్యే కిలారు రోశయ్య వివరంచారు. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 2018-19లో వ్యవసాయ రంగం ప్రతికూల వృద్ధి -6.5%గా నమోదు కాగా.. సీఎం జగన్ పాలనలో వ్యవసాయ రంగం 2021-22లో 8.2% వృద్ధి రేటును నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో పక్కాగా ఎమ్మెస్పీ అమలు
ఏపీ ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు పక్కాగా ఎమ్మెస్పీ అమలు చేస్తోందని ఎమ్మెల్యే ముస్తఫా వివరించారు. ప్రస్తుతం మిరపకాయలు – క్వింటాల్‌కు రూ. 7,000, పసుపు- రూ.6,850. ఎమ్మెస్పీగా ఉందన్నారు. సీఎం జగన్ రైతులు ఏ మాత్రం నష్టపోరాదని భావించి నివర్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన 1,392 పొగాకు రైతులకు సుమారు 118.4 లక్షల వ్యయంతో ఇన్‌పుట్ సబ్సిడీని అందించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించని పంటలకు కూడా ఏపీ ప్రభుత్వం మద్ధతు ధర చెల్లిస్తోందని ఎమ్మెల్యే ముస్తఫా వివరించారు.