Andhra PradeshHome Page Slider

డిసెంబర్ 29 నుండి ఆరోగ్య శ్రీ సేవలు బంద్!

ఏపీ: ఏపీలో జగన్ సర్కార్‌కు భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.1,000 కోట్ల బకాయిలు చెల్లించనందున ఈ నెల 29 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు రాష్ట్రంలో నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. బిల్లులు చెల్లించాలి, ప్యాకేజీలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి సంఘాలు.. ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు లేఖ రాశాయి. దీంతో ఈ నెల 29 నుండి కొత్త రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకునేది లేదన్నారు.