Home Page SliderNational

ధ్రువ్ హెలికాప్టర్లను నిలిపేయాలని సైన్యం నిర్ణయం

జమ్మూ మరియు కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో హెలికాప్టర్ హార్డ్ ల్యాండింగ్ కావడంతో ఒక టెక్నిషియన్ మృతి చెందడం, ఇద్దరు పైలట్‌లు గాయపడిన రెండు రోజుల తర్వాత, ఇండియన్ ఆర్మీ, స్వదేశీ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ‘ధృవ్’ ఫ్లీట్‌ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. మార్చిలో రెండు ప్రమాదాల తర్వాత నేవీ, కోస్ట్‌గార్డ్‌లు ఇటీవల హెలికాప్టర్‌లను నెల రోజులకు పైగా నిలిపివేశారు. గత రెండు నెలల్లో హెలికాప్టర్‌లో ఇది మూడో తీవ్రమైన సంఘటన.

అయితే అవసరాల దృష్ట్యా తనిఖీల తర్వాత ఫ్లీట్‌లోని కొన్నింటిని సైన్యం క్లియర్ చేసింది. నేవీ, కోస్ట్ గార్డ్ ధృవ్ హెలికాప్టర్లు తిరిగి పనిచేస్తాయో లేదో ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఛాపర్ కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు క్లియరెన్స్‌ను ఛాపర్‌ తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) ఇవ్వాల్సి ఉంది. గత రెండు నెలల్లో ALH ధ్రువ్‌కు సంబంధించిన మూడో ఘటన ఇది. గతంలో, భారత నావికాదళం ధృవ్ అరేబియా సముద్రంలో బలవంతంగా ల్యాండింగ్ చేయగా, కొచ్చి కోస్ట్ గార్డ్ నుండి బయలుదేరిన కొద్ది క్షణాల్లో బలవంతంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

ధృవ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ భారత సాయుధ దళాలకు కీలకమైన హెలికాప్టర్. సైన్యానికి ఇది ఎంతగానో ఉపకరిస్తోంది. సియాచిన్ మంచుకొండలు, లడఖ్‌లోని సైనికులకు సేవ చేయడానికి చాలా ఎత్తుకు ఇది ఎగురుతుంది. ఇటీవలి కాలంలో, ధ్రువ్ హెలికాప్టర్ పనితీరుపై మెకానికల్ లోపాలు, విశ్వసనీయతపై ఆందోళన ఎక్కువయ్యింది. భారత వైమానిక దళం వద్ద దాదాపు 70 ALH ధ్రువ్‌లు ఉన్నాయి.