బొల్లారంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని బొల్లారంలో 1ఈఎంఈ సెంటర్‌లో జరుగబోతోంది. జూన్ 3 నుండి ఈ ర్యాలీని నిర్వహించబోతున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు తెలిపారు. అగ్నివీర్ టెక్నికల్ కేటగిరీలో ఫిట్టర్, మెకానిక్స్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్, అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్, స్టీవార్డ్ వంటి ఉద్యోగాలతో పాటు ఓపెన్ కేటగిరీలో వాలీబాల్, ఈత వంటి రంగాల క్రీడాకారులకు కూడా ఈ ర్యాలీని నిర్వహిస్తారు. మాజీ సైనికోద్యోగుల కుమారులు, సోదరులు, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినవారి కుమారులు వంటివారి కోసం ఈర్యాలీని నిర్వహిస్తున్నారు. దీనికి అభ్యర్థులు 17 నుండి 21 ఏళ్ల వయస్కులై ఉండాలి. ఇతర వివరాల కోసం 1ఈఎంఈ సెంటర్ హెడ్‌క్వార్టర్స్‌ను కానీ, www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో, 140-27863016 నంబరును కానీ సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు.

