Home Page SliderNational

నా హీరో ని అనే అంత వాడివి కాదురా నువ్వు…..”మాస్ క దాస్”

ఇప్పటికే దేవర మూవీ మీద పెద్ద హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా రిలీజ్ అయినా ట్రైలర్ కూడా ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే రిలీజ్ అయినా పాటలు యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. అయితే స్టార్ హీరో సినిమా అంటే చాలా మంది వెయిట్ చేస్తారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో టిక్కెట్లు కూడా దురకడంలేదు. ఇదిలా ఉంటే పెద్ద సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తే నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కొంత మంది పాజిటివ్ గా ఇస్తే , కొంత మంది నెగిటివ్ గా ఇస్తారు. యూట్యూబ్‌లో ఇలాంటి వాళ్లు చాలా మందే ఉన్నారు. అలాచేస్తే బాగుంటుంది. అలా చేశారంటూ పనికిరాని కామెంట్స్ చేస్తారు. అయితే తాజాగా దేవర మూవీ మీద కూడా ఒకడు నెగిటివ్ గా రివ్యూ ఇచ్చాడు. ట్రైలర్ చూడబుద్ది కాలేదని ఒకరంటే, ట్రైలర్ ఏమంతా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు, నచ్చలేదని ఇంకొకరు కామెంట్ చేశారు. ఎన్టీఆర్ లుక్స్ మీద సైతం కామెంట్లు చేశారు. అది చూసిన విశ్వక్ సేన్ కోపం వచ్చింది. అసలే విశ్వక్ కు ఎన్టీఆర్ అంటే పిచ్చి. ఇంకా అసలు ఏ మాత్రం తాగకుండా విశ్వక్ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ముందు నువ్వు ఆ గోడ సాయం లేకుండా 2 నిముషాలు నిల్చో… ఆ తర్వాత మాట్లాడుకుందాం. అయినా నాకు కాలిపోతుంది నిన్ను చూస్తుంటే, ఏమైనా చేద్దామంటే. నీ మొహం కాలిపోయినట్టే ఉంది. ఇంకా ఎం చేస్తాం, అంటూ విశ్వక్ ఫైర్ అయ్యాడు.