Andhra PradeshHome Page Slider

మీ చీర చేనేతదేనా?.. డిప్యూటీ స్పీకర్ ఫన్నీ కామెంట్..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు చమత్కారాలు, ఆసక్తికర సన్నివేశాలతో కొనసాగుతున్నాయి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవితో ఫన్నీగా మాట్లాడారు. అయితే.. సభలో జనసేన ఎమ్మెల్యే చేనేత కార్మికుల సమస్యలను లేవనెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులు నెలకు ఒక రోజు చేనేత వస్త్రాలను ధరించేలా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని మాధవి ప్రశ్నించగా… ఇంతకీ మీరు ధరించింది చేనేత చీరనా? లేక వేరే చీరనా? అని రఘురాజు ప్రశ్నించారు. తాను చేనేత చీరను ధరించానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు. దీంతో సభలో నవ్వులు విరబూశాయి.