హైదరాబాద్ లో టమాటా ఫెస్టివల్.. మే 11న ప్రారంభం..
తెలంగాణ రాష్ట్రంలో మరో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరగబోతోంది. ఇందుకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. నగరంలో మొట్ట మొదటిసారిగా టమాటా ఫైట్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నారు. ఈ ఉత్సవం స్పెయిన్ లోని ప్రసిద్ధ లా టమాటినా నుంచి స్ఫూర్తి పొందింది. ఈ ఈవెంట్ మే 11, 2025న ఉదయం 10 గంటల నుంచి ఎక్స్ పీరియం ఎకో పార్క్ జరుగుతుంది. పాల్గొనేవారు వేల కిలోల టమాటాలను ఒకరిపై ఒకరు విసురుతూ ఆనందిస్తారు. అంతేకాదు, లైవ్ డీజే సంగీతం, నృత్య ప్రదర్శనలు, ఫుడ్ స్టాల్స్, షాపింగ్ కోసం ఫ్రీ మార్కెట్, ఫన్ జోన్స్ కూడా ఉంటాయి. టికెట్ల ధరలు రూ. 499 నుంచి రూ. 3,499 వరకు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ ఫెస్టివల్ లో ఉపయోగించిన టమాటాలను వృథా కాకుండా ఎరువుగా రీసైకిల్ చేసి, రైతులకు అందించనున్నారు. అయితే.. ఎండలతో అల్లాడుతున్న హైదరాబాదీలకు ఈ ఉత్సవం ఒక సరికొత్త ఆనందాన్ని అందించనుంది.

