మాపైనే ఫిర్యాదు చేస్తావా..
మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ రైలు ప్రయాణికుడిపై క్యాటరింగ్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన హేమకుంట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో చోటు చేసుకుంది. ట్రైన్లో క్యాటరింగ్ సిబ్బంది అధిక ఛార్జీలు వసూలు చేశారని ఆన్లైన్లో ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. మా పై ఫిర్యాదు చేస్తావా అంటూ ప్రయాణికుడిని క్యాటరింగ్ సిబ్బంది దారుణంగా కొట్టారు. హేమకుంట్ ఎక్స్ప్రెస్(14609)లో విశాల్ శర్మ అనే యూట్యూబర్ ప్రయాణం చేస్తుండగా క్యాటరింగ్ సిబ్బంది అటాక్ చేశారు. దీంతో అతను రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

