Home Page SliderTelangana

కల్లు తాగుతున్నారా..? అయితే జాగ్రత్త ..

కల్లు. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందరికీ అందుబాటులో ఉండే కల్లును అందరూ లాగించేస్తుంటారు. అయితే.. కల్లులో మత్తు రావడానికి ప్రమాదకరమైన క్లోరల్ హైడ్రేట్, డైజోపామ్, ఆల్ఫోజోలం వంటివి కలపడంతో ప్రజల ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపుతాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలో కల్లులో కలిపే రసాయనాలను సీజ్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. స్థానిక శాంతినగర్ కాలనీలో ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. సుమారు రూ.43 లక్షల విలువైన 26 సంచుల క్లోరల్ హైడ్రేడ్, మూడు కిలోల ఆల్ఫోజోలం సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.