అవినీతి పరుడు నువ్వా? నేనా? రా తేల్చుకుందాం?-బండి
కరీంనగల్: తాను అవినీతి పరుడినంటూ బీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఆరోపణలు చేయడాన్ని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. కోట్లు సంపాదించినట్లు నిరూపిస్తే కరీంనగర్ ప్రజలకు రాసిస్తా, నువ్వు పంచి ఇచ్చేందుకు రెడీయా? అంటూ సంజయ్ సవాల్ విసిరారు. కరీంనగర్‌లోని పలు సెంటర్లలో, కాలనీల్లో ఎన్నికల ప్రచారం చేశారు. మంత్రిగా కేసీఆర్‌ను ఒప్పించి ఎన్ని నిధులు తీసుకొచ్చావో చెప్పు. తాను కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చానో లెక్కలతో సహా వివరాలు ఇచ్చేందుకు సిద్ధమన్న బండి సంజయ్. నీకు దమ్ముంటే ఈ సవాల్‌ను ఎదుర్కోవాలన్న బండి సంజయ్.

