Home Page SliderTelangana

కాంగ్రెస్‌లో అమ్ముడు కాని ఎమ్మెల్యేలున్నారా?: బండి సంజయ్

జుక్కల్: కాంగ్రెస్ వాళ్లు ఆరు గ్యారంటీ హామీల గురించి మాట్లాడుతుంటే నవ్వాపుకోలేకపోతున్నాను.. ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోరనే గ్యారంటీ ఇవ్వగలరా? ఎందుకంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కేసీఆర్‌కు అమ్ముడైనవాళ్లే.. ఈసారి అమ్ముడుపోకుండా ఉంటారా? నమ్మసఖ్యంగాలేదు? ముందు ఈ విషయంపై మాట్లాడిన తర్వాతే ఆరు గ్యారంటీల గురించి చెప్పి ప్రజలను ఓట్లు అడగాలి అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు గెలిస్తే సీఎం పదవి కోసం కుమ్ములాటలు తథ్యం..